గత ప్రభుత్వంలో అధఃపాతాళానికి వ్యవసాయం

ఎన్నడూ లేనివిధంగా గత   ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం అధఃపాతాళానికి చేరిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

Published : 11 Jul 2024 04:36 IST

తెదేపా నేత యనమల రామకృష్ణుడు

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నడూ లేనివిధంగా గత   ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం అధఃపాతాళానికి చేరిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. 2014-19 మధ్య 12.85 శాతంగా ఉన్న వ్యవసాయ వృద్ధి రేటు జగన్‌  పాలనలో 6.14 శాతానికి పరిమితమైందని పేర్కొన్నారు. సాగునీటి  ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం, పంటలకు గిట్టుబాటు ధరలు లేక.. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని దుయ్యబట్టారు. పారిశ్రామిక, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆక్వా, పర్యాటకం అన్నీ  తిరోగమనంలో సాగాయని ప్రకటనలో మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని