చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీ శుభపరిణామమే

విభజన సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి భేటీ కావడం శుభపరిణామమేనని వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Published : 11 Jul 2024 04:37 IST

వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 

ఈనాడు, ఒంగోలు: విభజన సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి భేటీ కావడం శుభపరిణామమేనని వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని తన నివాసంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. విభజన సమస్యల పరిష్కారానికి ముందు.. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకురావాలని సూచించారు. అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందించడం మంచిదేనని, అదే సమయంలో వైకాపా ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు, బాండ్ల విక్రయాల్లో అక్రమాలంటూ దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఆధారాలుంటే అధికారంలో ఉన్నవాళ్లు నిరూపించాలని డిమాండ్‌ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారన్నది ప్రచారం మాత్రమేనని.. అలాంటి పరిస్థితి రాదని వైవీ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని