హత్యా రాజకీయాలు వీడని వైకాపా

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో తెదేపా కార్యకర్త గొల్ల ఆదెప్ప హత్యపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Published : 11 Jul 2024 04:37 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
ఆదెప్ప మృతిపై దిగ్భ్రాంతి 

ఈనాడు డిజిటల్, అమరావతి : అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో తెదేపా కార్యకర్త గొల్ల ఆదెప్ప హత్యపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలు ఛీ కొట్టినా వైకాపా నాయకులు హత్యా రాజకీయాలు మానడం లేదని బుధవారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి నేటి వరకు 9 మంది తెదేపా కార్యకర్తల్ని వైకాపా వారు పొట్టనపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గ్రామంలో ఆలయ అర్చకత్వం విషయంలో తలెత్తిన వివాదంతో ఆదెప్పపై కక్ష పెంచుకొని దారికాచి వైకాపా కార్యకర్తలు నరికి చంపారు. యథా లీడర్‌ తథా క్యాడర్‌ అన్నట్టు జగన్‌రెడ్డి బాటలోనే ఆ పార్టీ మూకలు పయనిస్తున్నాయి. మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటాం’’ అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని