పోరాడిన ప్రతి మహిళకూ వైకాపా పాలనలో వేధింపులే

న్యాయబద్ధంగా, నీతిగా పోరాడిన ప్రతి మహిళా వైకాపా పాలనలో వేధింపులకు గురయ్యారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 11 Jul 2024 04:40 IST

-ఎమ్మెల్యే గౌతు శిరీష

విలేకర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: న్యాయబద్ధంగా, నీతిగా పోరాడిన ప్రతి మహిళా వైకాపా పాలనలో వేధింపులకు గురయ్యారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాను ఎంత అసభ్యకరంగా, భయంకరంగా వాడుకోవచ్చో గత ఐదేళ్ల పాలనలో వైకాపా చూపించిందని విమర్శించారు. సామాజిక మాధ్యమంలో అసభ్యకరంగా వేధించిన వారిపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన ఎమ్మెల్యే శిరీష... బుధవారం విశాఖలో రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయస్థానానికి హాజరై లిఖితపూర్వకంగా సాక్ష్యం ఇచ్చారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి ఈ నెల 18కి వాయిదా వేశారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. వైకాపా పాలనలో మార్ఫింగ్‌ ఫొటోలు, అసభ్యకర రాతలతో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు 20 మందితో తనపై, తన కుటుంబ సభ్యులపైనా అసభ్యకరంగా రాయించారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని