ఆస్తులు కాపాడుకోలేని దుస్థితిలో పోలీసుశాఖ: వర్ల రామయ్య

తన ఆస్తులను కాపాడుకోలేని దుస్థితిలో ఉన్న పోలీసు శాఖ ...ప్రజల ఆస్తులను ఏ విధంగా కాపాడుతుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. తెదేపా కేంద్ర

Published : 15 Jun 2022 04:34 IST

ఈనాడు, అమరావతి: తన ఆస్తులను కాపాడుకోలేని దుస్థితిలో ఉన్న పోలీసు శాఖ ...ప్రజల ఆస్తులను ఏ విధంగా కాపాడుతుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘తిరుపతి జిల్లా చంద్రగిరిలో 1.33 ఎకరాల్లో పోలీసు సిబ్బందికి క్వార్టర్లు, జిమ్‌, ఇతర నిర్మాణాలు చేపట్టే ఉద్దేశంతో బ్రిటీష్‌ ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఇది పోలీసులకు చెందినదిగా అడంగల్‌లోనూ క్లియర్‌గా ఉంది. రూ.కోట్ల విలువైన ఈ స్థలాన్ని వైకాపా కార్యాలయానికి ఇవ్వడంలో అర్థం లేదు. ఎవరికీ తెలియకుండా చంద్రగిరి ఎమ్మెల్యే ఈ స్థలంలో భూమి పూజ చేయడం ఏమిటి? దానికి ఆధారాలున్నాయి. ఈ కబ్జాకు పోలీసు శాఖ ఎలా సహకరిస్తుంది? ఈ వ్యవహారానికి సంబంధించిన జీవోను గోప్యంగా ఉంచారు. తుడా ఆధ్వర్యంలో గతంలో ఇక్కడ పార్కు ఏర్పాటు చేస్తామని సంబంధిత అధికారులు సంప్రదిస్తే కుదరదని ఎస్పీ లేఖ రాశారు. ఇప్పుడు అధికార పార్టీకి అప్పనంగా ఎలా అప్పజెప్పారు...’ అని వర్ల రామయ్య మండిపడ్డారు. ‘తిరుపతికి చెందిన విశ్రాంత పోలీస్‌ అధికారి కృష్ణయ్య ఎంతో ఆవేదనతో ఈ స్థలాన్ని కాపాడాలని డీజీపీ, ఎస్పీకి మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. ఎకరా రూ.30కోట్ల విలువ చేసే ఈ భూమిని వైకాపా సులువుగా కొట్టేసింది. ఈ స్థలాన్ని నిబంధనల ప్రకారమే ఇచ్చామని అధికారులు చెప్పగలరా? డీజీపీ ఇప్పటికైనా మేల్కొని ఏం జరుగుతుందో చూ¯లి.’ అని వర్ల రామయ్య కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని