CM KCR: కేసీఆర్‌కు స్వాగతం చెబుతూ దిల్లీలో హోర్డింగ్‌.. కాసేపటికి తొలగింపు

‘‘దేశ్‌కా నేత కేసీఆర్‌. దిల్లీకి హృదయపూర్వక స్వాగతం. తెలంగాణ వికాస పురుషుడు అన్న పేరుతో విఖ్యాతులైన కేసీఆర్‌ దేశానికి కొత్త దిశను ఇవ్వడానికి వస్తున్నారు. భారతీయ రాష్ట్ర సమితి పార్టీతో కేసీఆర్‌ దేశ ప్రజలను ఉత్థానస్థితికి తీసుకెళ్తారు’’ అంటూ దిల్లీలో హోర్డింగ్‌

Updated : 16 Jun 2022 09:31 IST

ఈనాడు, దిల్లీ ‘‘దేశ్‌కా నేత కేసీఆర్‌. దిల్లీకి హృదయపూర్వక స్వాగతం. తెలంగాణ వికాస పురుషుడు అన్న పేరుతో విఖ్యాతులైన కేసీఆర్‌ దేశానికి కొత్త దిశను ఇవ్వడానికి వస్తున్నారు. భారతీయ రాష్ట్ర సమితి పార్టీతో కేసీఆర్‌ దేశ ప్రజలను ఉత్థానస్థితికి తీసుకెళ్తారు’’ అంటూ దిల్లీలో హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం బుధవారం ప్రతిపక్షాలు సమావేశమైన కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ ఎదుట ఏర్పాటుచేసిన ఈ హోర్డింగ్‌ చర్చనీయాంశమైంది. ఈ సమావేశానికి కేసీఆర్‌, తెరాస ప్రతినిధులు హాజరవకున్నా.. దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారన్న ప్రశ్న కొద్దిసేపు అందర్నీ తొలిచేసింది. తర్వాత కొద్దిసేపటికి ఈ హోర్డింగ్‌ను తొలగించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని