ఆత్మకూరులో లక్ష మెజారిటీ ఏమైంది?

ఆత్మకూరు ఉప ఎన్నికలో లక్ష ఓట్ల మెజారిటీ ఏమైందని మంత్రి అంబటి రాంబాబును భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. వైకాపా వాళ్లు ఎన్ని కుట్రలు

Published : 27 Jun 2022 04:05 IST

భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆత్మకూరు ఉప ఎన్నికలో లక్ష ఓట్ల మెజారిటీ ఏమైందని మంత్రి అంబటి రాంబాబును భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. వైకాపా వాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా, కుతంత్రాలకు తెరలేపినా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగినా భాజపాకు 19,353 ఓట్లు వచ్చాయని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ఆత్మకూరులో భాజపా ఓట్లు రెండు వేల నుంచి సుమారు 20 వేలకు పెరిగాయి. కోట్లు ఖర్చుపెట్టి లక్ష మెజారిటీ అన్నారు. మరి బద్వేలులో వచ్చిన మెజారిటీ కంటే ఇక్కడెందుకు తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వైకాపాపై ఉన్న వ్యతిరేకత మున్ముందు ఇంకా బయటపడుతుంది. ప్రజలు ఓట్ల రూపంలో మీకు గట్టి సమాధానం చెబుతారు’’ అని విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని