ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు?: ఎమ్మెల్సీ

ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రశ్నించారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, ఆర్జిత సెలవుల నగదీకరణ,

Published : 27 Jun 2022 04:05 IST

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రశ్నించారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, ఆర్జిత సెలవుల నగదీకరణ, పెన్షనర్ల ప్రయోజనాలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు ఎప్పుడు ఆమోదిస్తారని ప్రశ్నించారు. గత ఏడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నిబంధన సరికాదు
ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు టెట్‌ పాస్‌ కావాలనే నిబంధన తెచ్చి జగన్‌ ప్రభుత్వం లక్షల మంది ఉపాధ్యాయులను రోడ్డున పడేసేందుకు ప్రయత్నిస్తోందని తెదేపా హెచ్‌ఆర్డీ సభ్యుడు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘‘జగన్‌ కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ప్రైవేట్‌ ఉద్యోగాలను తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కుట్రను పాఠశాలల యాజమాన్యాలు, టీచర్లు ప్రతిఘటించాలి. ఈ నిబంధన ఎత్తివేసే వరకు తెదేపా పోరాడుతుంది’’ అని రామగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని