ప్రభుత్వాలను పడగొట్టడమే మోదీ పని

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పరిపాలనను గాలికొదిలేసి, దేశంలోని భాజపాయేతర పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంపైనే దృష్టి సారిస్తోందని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ విమర్శించారు. కక్ష సాధింపు

Published : 27 Jun 2022 05:16 IST

 ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పరిపాలనను గాలికొదిలేసి, దేశంలోని భాజపాయేతర పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంపైనే దృష్టి సారిస్తోందని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ విమర్శించారు. కక్ష సాధింపు కోసం ఐటీ, ఈడీని ఉసిగొల్పుతోందన్నారు. ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గోవా తదితర రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వాలను భాజపా కూలగొట్టిందని.. తాజాగా మహారాష్ట్రలోనూ అదే పని చేస్తోందని దుయ్యబట్టారు. ఆదివారం ఆయన ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, ముఠా గోపాల్‌, మెతుకు ఆనంద్‌, నోముల భగత్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌లతో కలిసి తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న మోదీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక గాలి వీస్తోందన్నారు. కేంద్రంలోని భాజపా సర్కారుకు కౌంట్‌డౌన్‌ మొదలైందని..‘బై బై మోదీ’ నినాదం ట్రెండింగ్‌ అవుతోందని తెలిపారు. వెంటనే ఆయన దిగిపోవాలని దేశం యావత్తు సామాజిక మాధ్యమాల ద్వారా డిమాండ్‌ చేస్తోందని చెప్పారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ‘సాలు దొర.. సెలవు దొర’ డిజిటల్‌ బోర్డును తొలగించాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మోదీ బోర్డులు పెట్టి చెప్పుల దండలు వేస్తామని బాల్క సుమన్‌ హెచ్చరించారు. భాజపా తెలంగాణ ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌ తెలివితక్కువగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెడుతున్న భాజపా.. ఇప్పటి దాకా తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు