భట్టిని కలిసిన అశ్వారావుపేట కాంగ్రెస్‌ నాయకులు

కాంగ్రెస్ట్‌లో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చేరికపై అసంతృప్తిగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన నాయకులు ఆదివారం హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. జడ్పీటీసీ

Published : 27 Jun 2022 05:24 IST

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: కాంగ్రెస్ట్‌లో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చేరికపై అసంతృప్తిగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన నాయకులు ఆదివారం హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. జడ్పీటీసీ సభ్యురాలు సున్నం నాగమణి.. జిల్లా పార్టీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, కొంతమంది అనుచరులను వెంటబెట్టుకుని భట్టి వద్దకు వెళ్లారు. నియోజకవర్గ నాయకులకు తెలియకుండా వెంకటేశ్వర్లును పార్టీలో చేర్చుకోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసి, తమ భవితవ్యమేమిటని ప్రశ్నించినట్లు సమాచారం. పనిచేసే వారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని, అధైర్యపడవద్దని ఆయన వారికి నచ్చచెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని