‘శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు నిర్వీర్యం’

ప్రస్తుతం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ చీకటి రోజును పురస్కరించుకుని నిర్బంధ వ్యతిరేక వేదిక రాష్ట్ర

Published : 27 Jun 2022 05:24 IST

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: ప్రస్తుతం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ చీకటి రోజును పురస్కరించుకుని నిర్బంధ వ్యతిరేక వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ సుందరయ్య కళానిలయంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెజస రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ పాలన కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో అనధికార ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయన్నారు. జైళ్లలో అక్రమంగా నిర్బంధించిన వారిని బేషరతుగా విడిచిపెట్టాలని వేదిక రాష్ట్ర కో-కన్వీనర్‌ రవిచంద్ర, వీక్షణం సంపాదకుడు ఎన్‌.వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని