బడుల కంటే మద్యం దుకాణాలే ఎక్కువ

కేసీఆర్‌ ఎనిమిదేళ్ల పాలనలో హామీలు అమలుకు నోచుకోవడం లేదని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. సున్నా వడ్డీకే రుణాలు, ఉచిత ఎరువులు, రెండు పడక గదుల ఇళ్లు, మూడెకరాల భూపంపిణీ తదితర హామీలను

Published : 27 Jun 2022 05:24 IST

ప్రజాప్రస్థానం యాత్రలో షర్మిల విమర్శ

పెన్‌పహాడ్‌, న్యూస్‌టుడే: కేసీఆర్‌ ఎనిమిదేళ్ల పాలనలో హామీలు అమలుకు నోచుకోవడం లేదని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. సున్నా వడ్డీకే రుణాలు, ఉచిత ఎరువులు, రెండు పడక గదుల ఇళ్లు, మూడెకరాల భూపంపిణీ తదితర హామీలను సీఎం కేసీఆర్‌ గాలికొదిలేశారని తూర్పారబట్టారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం భక్తళాపురం, భాగ్యతండాలో ప్రజాప్రస్థానం యాత్రను ఆదివారం కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు కేసీఆర్‌ పంచన చేరాయని షర్మిల ఆరోపించారు. తెలంగాణలో బడులు, గుడుల కన్నా మద్యం దుకాణాలు, బెల్ట్‌షాపులే అధికంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. వైతెపా అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జేవీఆర్‌, తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని