Taneti Vanitha: వాలంటీరు పోస్టులిచ్చింది.. మన పార్టీ వారికే కదా

పార్టీ అంటేనే కార్యకర్తలని.. అటువంటి వారికి గుర్తింపు లేకుండా ఎలా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఆ నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే

Updated : 28 Jun 2022 07:48 IST

హోం మంత్రి తానేటి వనిత

నిడదవోలు, న్యూస్‌టుడే: పార్టీ అంటేనే కార్యకర్తలని.. అటువంటి వారికి గుర్తింపు లేకుండా ఎలా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఆ నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోంమంత్రి పాల్గొని మాట్లాడుతూ.. వైకాపాలో కార్యకర్తలకు గుర్తింపు లేదని కొంతమంది విషప్రచారం చేస్తున్నారని చెప్పారు. ‘నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చింది పార్టీ వారికి కాదా? వాలంటీరు పోస్టులు ఇచ్చింది.. వైకాపా కుటుంబాలకు చెందిన వారికి కాదా’ అంటూ ఆమె ప్రశ్నించారు. మంత్రి మాట్లాడుతున్న సమయంలో పలువురు కార్యకర్తలు వెళ్లిపోయారు. ఒక సమయంలో బయటకు వెళ్లే ప్రధాన ద్వారాన్ని మూసివేయడంతో తెరవాలంటూ కార్యకర్తలు కేకలు వేయగా, తలుపు తీయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌నాయుడు మైక్‌లో చెప్పారు. సమావేశంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని