Gudivada Amarnath: అయ్యన్న నాలుక చీరేస్తా!: మంత్రి అమర్‌నాథ్‌ హెచ్చరిక

‘ప్రేలాపన తగ్గించుకోకపోతే అయ్యన్నా.. నీ నాలుక చీరేస్తా....’ అంటూ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ హెచ్చరించారు. మంగళవారం రాత్రి చోడవరంలోని

Updated : 29 Jun 2022 08:05 IST

చోడవరం, న్యూస్‌టుడే: ‘ప్రేలాపన తగ్గించుకోకపోతే అయ్యన్నా.. నీ నాలుక చీరేస్తా....’ అంటూ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ హెచ్చరించారు. మంగళవారం రాత్రి చోడవరంలోని అన్నవరంలో జరిగిన నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడు రోడ్లపై తిరగకుండా కార్యకర్తలు నడుం బిగించాలన్నారు. తెలుగు మహిళా నాయకురాలు అనితపైనా ఆయన విరుచుకుపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఏ వాలంటీరైనా మాట వినకపోతే వెంటనే పీకేయ్యండంటూ నాయకులకు సూచించారు. అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బి.సత్యవతి ప్రసంగిస్తూ తెదేపా నాయకులు ఓ విధమైన ఒత్తిడితో రగిలిపోతున్నారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని