YSRCP: వైకాపా గెలుపు అంత సులభం కాదు: ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య

రానున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌రోజు పెద్ద యుద్ధమే జరుగుతుందని, పార్టీ గెలవడం అంత సులభమేమీ కాదని వైకాపా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా

Updated : 30 Jun 2022 11:55 IST

రాయచోటి, న్యూస్‌టుడే: రానున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌రోజు పెద్ద యుద్ధమే జరుగుతుందని, పార్టీ గెలవడం అంత సులభమేమీ కాదని వైకాపా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో బుధవారం జరిగిన వైకాపా జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. వైకాపా ప్రభుత్వం మళ్లీ రాకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. క్షేత్రస్థాయిలో నాయకులు చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రజల్లో నమ్మకం కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని, దేశంలో పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలోనూ అలాగే ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎక్కువయ్యారని, వారి కోర్కెలూ అదేరీతిన పెరగడంవల్ల వాటిని ఎవరూ తీర్చలేరని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని