దళితవాడలను బంగారు మేడలుగా మారుస్తాం

దళితబంధు పథకాన్ని చూసి తెలంగాణలోని అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు విస్తుపోతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ పథకంతో రాష్ట్రంలోని దళితవాడలను బంగారు మేడలు చేయాలన్నదే ప్రభుత్వ

Published : 30 Jun 2022 05:39 IST

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

చింతకాని, న్యూస్‌టుడే: దళితబంధు పథకాన్ని చూసి తెలంగాణలోని అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు విస్తుపోతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ పథకంతో రాష్ట్రంలోని దళితవాడలను బంగారు మేడలు చేయాలన్నదే ప్రభుత్వ ఆశయం అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ, కొదుమూరు గ్రామాల్లో బుధవారం దళితబంధు పథకం కింద లబ్ధిదారులకు మంత్రి వాహనాలను అందజేశారు. నాగులవంచలో హార్వెస్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న పలు పథకాలు భారతదేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని