రాష్ట్ర ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు: తరుణ్‌ ఛుగ్‌

కేసీఆర్‌ కుటుంబ, అవినీతి, దుష్పరిపాలన నుంచి రాష్ట్రప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, అందుకు ఈ నెల 3న పరేడ్‌ మైదానంలో నిర్వహించే బహిరంగ సభ ఓ మైలురాయిగా నిలుస్తుందని భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌

Published : 30 Jun 2022 05:39 IST

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: కేసీఆర్‌ కుటుంబ, అవినీతి, దుష్పరిపాలన నుంచి రాష్ట్రప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, అందుకు ఈ నెల 3న పరేడ్‌ మైదానంలో నిర్వహించే బహిరంగ సభ ఓ మైలురాయిగా నిలుస్తుందని భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌ అన్నారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా 35 వేల బూత్‌ల నుంచి పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలి వస్తారన్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను తరుణ్‌ ఛుగ్‌ బుధవారం పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, గరికపాటి రామ్మోహన్‌రావు తదితరులతో కలిసి పరిశీలించారు. రాబోయేది భాజపా ప్రభుత్వమేనని తరుణ్‌ ఛుగ్‌ అన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్‌, కేసీఆర్‌ల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌, కంటోన్మెంట్‌ బోర్డు నామినేటెడ్‌ సభ్యుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు