కమలం గూటికి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి?

హైదరాబాద్‌ కేంద్రంగా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కమలదళం ఇతర పార్టీల నేతలను పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో భాజపా

Published : 30 Jun 2022 05:39 IST

పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్‌ ఛుగ్‌, బండి సంజయ్‌

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితోనూ చర్చలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కమలదళం ఇతర పార్టీల నేతలను పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో భాజపా తెలంగాణ ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బుధవారం సమావేశమయ్యారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. జులై 1న, లేదంటే 2న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కొండా చేరనున్నట్లు భాజపా వర్గాల సమాచారం.తరుణ్‌ ఛుగ్‌, బండి సంజయ్‌ బుధవారం ఉదయం బంజారాహిల్స్‌లోని విశ్వేశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లి.. గంటకుపైగా చర్చించారు. ‘గతంలో కలిసినప్పుడు పార్టీలో చేరేందుకు రెండు, మూడు నెలల సమయం కావాలని అడిగారు. ఆ సమయం కూడా అయ్యింది. కార్యవర్గ సమావేశాల సమయంలో భాజపాలోకి వస్తే బాగుంటుంది’ అంటూ కొండాను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నడ్డాతో విశ్వేశ్వర్‌రెడ్డిని మాట్లాడించినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ సహా పలు అంశాల్లో భాజపా వైఖరిపై స్పష్టత ఇవ్వాలని కొండా అడిగారు. వర్గీకరణ చేస్తే మందకృష్ణ వంటి నేతలూ కలిసి వస్తారని ఆయన అన్నట్లు సమాచారం. ‘పార్టీలోకి రావాలని రెండేళ్లుగా భాజపా నేతలు అడుగుతున్నారు. ఇప్పుడు తరుణ్‌ ఛుగ్‌, సంజయ్‌ వచ్చి ఆహ్వానించారు. నా నిర్ణయాన్ని గురువారం ప్రకటిస్తా’ అని విశ్వేశ్వర్‌రెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కూడా భాజపా ఆహ్వానించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని