- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Ayyanna Patrudu: న్యాయస్థానాలు ఉన్నందునే ఇంకా బతికున్నాను: అయ్యన్న
ఈనాడు డిజిటల్, అమరావతి: న్యాయస్థానాలు ఉండబట్టే తానింకా బతికున్నానని, న్యాయ వ్యవస్థే లేకపోతే ఈ మూడేళ్లలో తనలాంటి వాళ్లెందరినో వైకాపా వాళ్లు చంపేసి ఉండేవారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇప్పటికే చాలా మందిని చంపేశారని, కొందరి ఇళ్లు తగలబెట్టి, మరి కొందరివి పడగొట్టారని ఆరోపించారు. తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైకాపా నాయకుల కంటే అసభ్యంగా నేనేమీ మాట్లాడలేదు. ఆంధ్రా విశ్వవిద్యాలయం గురించి అయ్యన్నపాత్రుడు మాట్లాడింది తప్పు అని విశాఖ పోలీస్ స్టేషన్లో నాపై కేసు పెట్టారు. నేను ఆంధ్ర యూనివర్సిటీ పరువు తీశానంటున్నారు. విశ్వవిద్యాలయం గ్రౌండ్లో కట్టలుగా నిరోధ్లు దొరికాయి. దాన్ని నేను ప్రస్తావిస్తే సీఎం, విజయసాయిరెడ్డి లాంటివాళ్లు దానిపై విచారణ చేసి వాస్తవాలు బయటపెట్టాలి. అలా చేయకుండా నాపై కేసులు పెట్టడం మూర్ఖత్వం’ అని అయ్యన్నపాత్రుడు అన్నారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజులా తననూ కొట్టించాలన్నది వైకాపా నాయకుల ఆలోచన అని ఆయన ఆరోపించారు. ‘నా మీద వైకాపా ప్రభుత్వం 12 కేసులు పెట్టింది. అన్ని కేసుల్లోనూ హైకోర్టు ద్వారా నాకు ఊరట లభించింది. ఇప్పుడు వారి ఆలోచన ఎఫ్ఐఆర్ లేకుండా నా మీద కేసు పెట్టడం.. ఎఫ్ఐఆర్ లేకుండా నన్నెలా అరెస్టు చేస్తారు. 26 జిల్లాల్లో ఎక్కడో ఒక దగ్గర నా మీద కేసు నమోదు చేసి అర్ధరాత్రి ఇంటికి వచ్చి అరెస్టు చేస్తామంటే కుదరదు’ అని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Chiranjeevi: మెగా హీరోలను కలవాలనుకుంటున్నారా? మీకిదే అవకాశం!
-
Politics News
Andhra News: వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు.. వాళ్ల చిట్టా విప్పుతా: మాజీ మంత్రి అనిల్
-
Sports News
Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
ZIM vs IND: ఒకే ఏడాది.. భారత్ రెండోసారి 10 వికెట్ల విజయం
-
Politics News
Bandi sanjay: భాజపాతో బలప్రదర్శనకు కేసీఆర్ సిద్ధమా?: బండి సంజయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- Liger: ‘లైగర్’ సినిమా.. ఏడు అభ్యంతరాలు చెప్పిన సెన్సార్ బోర్డ్
- Thiru review: రివ్యూ: తిరు
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Jammu: ఉగ్రవాది అతితెలివి.. ఎన్కౌంటర్ చేసిన పోలీసులు