పనిచేసే కార్యకర్తలను గుర్తించాలి
‘లాగే గుర్రం తన్నదు.. తన్నే గుర్రం లాగద’ంటూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ విశాఖ జిల్లా వైకాపా ప్లీనరీలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గురువారం విశాఖలోని
విశాఖ జిల్లా వైకాపా ప్లీనరీలో ఎమ్మెల్యే వాసుపల్లి
ఈనాడు, విశాఖపట్నం: ‘లాగే గుర్రం తన్నదు.. తన్నే గుర్రం లాగద’ంటూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ విశాఖ జిల్లా వైకాపా ప్లీనరీలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గురువారం విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో జిల్లా ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ‘కార్యకర్తల్లో లాగే గుర్రాలు జెండా వేసుకుని లాగుతూనే ఉంటాయి. తన్నే గుర్రాలు మాత్రం ఫైళ్లు పట్టుకుని నాయకుల చుట్టూ తిరుగుతూ పదవులు దక్కించుకుంటున్నాయి. దీన్ని వైవీ సుబ్బారెడ్డి గమనించాలి. లాగే గుర్రాలను గుర్తించాల్సిన అవసరం, బాధ్యత వేదికపైనున్న అందరికీ ఉంది’ అని పేర్కొన్నారు. కొందరు కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని, కొన్ని ఇబ్బందికర పరిస్థితులున్నాయని, వాటిని ఎలా అధిగమించాలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రస్థాయి ప్లీనరీలో వివరిస్తారని విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అందరికీ ఒకేసారి న్యాయం చేసే అవకాశం లేకపోవడంతో కొందరికి న్యాయం చేయగలిగామని, న్యాయం జరగని వారి గురించి సీఎం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. సమావేశంలో విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి విడదల రజిని మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలంటూ మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బలపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్