అదాన్‌ డిస్టలరీస్‌ జగన్‌, విజయసాయిరెడ్డిల కంపెనీనే

అదాన్‌ డిస్టలరీస్‌ సీఎం జగన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిలకు చెందిన కంపెనీ అని..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధివిధానాలకు విరుద్ధంగా దీన్ని ఏర్పాటు చేశారని తెదేపా రాష్ట్ర

Published : 01 Jul 2022 04:48 IST

ఆనం వెంకటరమణారెడ్డి వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అదాన్‌ డిస్టలరీస్‌ సీఎం జగన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిలకు చెందిన కంపెనీ అని..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధివిధానాలకు విరుద్ధంగా దీన్ని ఏర్పాటు చేశారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. వీరికి చెందిన సూట్‌కేస్‌ కంపెనీలు రెండు వందల వరకు ఉన్నాయని గురువారం విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ‘‘లిక్కర్‌ అండ్‌ బీరు సంఘం వారు బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశానికి అదాన్‌ డిస్టలరీస్‌ నుంచి ఒక్క ముఖ్యమైన వ్యక్తి కూడా హాజరుకాలేదు. దీనిబట్టే ఈ కంపెనీ డొల్లతనం బయటపడుతోంది. గతంలోనూ జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి అనేక సూట్‌కేస్‌ కంపెనీలు పెట్టి అవినీతికి పాల్పడ్డారు. 2019 డిసెంబరు 2న అదాన్‌ కంపెనీ పెట్టారు. 50శాతం ఆదాయాన్ని ఆదాన్‌ డిస్టలరీస్‌కు ప్రభుత్వమే ఇస్తోంది. రెండేళ్లలో 68 లక్షల మద్యం కేసులు సప్లయి చేశారు. రూ.1,164 కోట్లు టర్నోవర్‌ సాధించారు. సీసాలో ఏం పోసిచ్చినా తాగుతారులే అన్న భ్రమలో జగన్‌, విజయసాయిరెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో సరఫరా అవుతున్న మద్యంలో విషపదార్థాల అంశంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు ’’ అని ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని