యశ్వంత్‌కు ఘనంగా స్వాగతం చెబుదాం

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా రాక సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఆయనకు ఘనంగా స్వాగతం చెబుదామని మంత్రి కేటీ రామారావు తెలిపారు. బేగంపేట నుంచి ఆయనను

Published : 01 Jul 2022 05:44 IST

తెరాస నేతలతో కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌, ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా రాక సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఆయనకు ఘనంగా స్వాగతం చెబుదామని మంత్రి కేటీ రామారావు తెలిపారు. బేగంపేట నుంచి ఆయనను 6 వేల బైక్‌లతో ఊరేగింపుగా తీసుకొని వస్తామని, జలవిహార్‌ వద్ద సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సిన్హాకు స్వాగత ఏర్పాట్లపై గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో నగర మంత్రులు, తెరాస నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి మంత్రి బాధ్యతలను నిర్దేశించారు. ఈ క్రమంలో జలవిహార్‌లో ఈ నెల 2న నిర్వహించే యశ్వంత్‌ సిన్హా సభ ఏర్పాట్లను మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, మేయర్‌ విజయలక్ష్మి తదితరులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రచార కమిటీ సభ్యుడు, ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. శనివారం ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి సిన్హా చేరుకుంటారని, ఆయనకు సీఎం కేసీఆర్‌, మంత్రులు స్వాగతం పలుకుతారని వివరించారు. సభ ముగిశాక గాంధీభవన్‌, ఎంఐఎం కార్యక్రమాలకు హాజరై సాయంత్రం బెంగళూరుకు పయనం అవుతారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని