తెలంగాణపై భాజపా రాజకీయ తీర్మానం!

రాజధానిలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎజెండా తయారీ, తీర్మానాల విషయంపై భాజపా కసరత్తు ప్రారంభించింది. జాతీయస్థాయికి సంబంధించిన విషయాలతో పాటు తెలంగాణకు సంబంధించిన అంశం కూడా

Published : 01 Jul 2022 05:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎజెండా తయారీ, తీర్మానాల విషయంపై భాజపా కసరత్తు ప్రారంభించింది. జాతీయస్థాయికి సంబంధించిన విషయాలతో పాటు తెలంగాణకు సంబంధించిన అంశం కూడా ఉండనున్నట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం తెలంగాణపై రాజకీయ తీర్మానం చేయనుంది. ఉద్యమ నినాదాలు.. ఆశించిందేంటి.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏం జరుగుతోంది అన్న విషయాలతో తీర్మానం చేయనున్నట్లు సమాచారం. ‘తెరాస ప్రభుత్వ పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని.. భాజపా అధికారంలోకి వస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తుంది’.. అంటూ తీర్మానం రూపొందిస్తున్నట్లు తెలిసింది.  జాతీయ ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం రాత్రి నిర్వహించే సమావేశంలో జేపీ నడ్డా కార్యవర్గ సమావేశాల ఎజెండా, తీర్మానాల్ని ఖరారు చేస్తారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగానూ తీర్మానం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని