సమాఖ్య వ్యవస్థకు అండగా నిలబడతా

సమాఖ్య వ్యవస్థకు అండగా నిలబడతానని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో డీఎంకే, దాని మిత్రపక్షాల మద్దతు కోరేందుకు గురువారం ఆయన చెన్నైకు వచ్చారు. తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయమైన

Published : 01 Jul 2022 05:44 IST

యశ్వంత్‌ సిన్హా

చెన్నై, న్యూస్‌టుడే: సమాఖ్య వ్యవస్థకు అండగా నిలబడతానని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో డీఎంకే, దాని మిత్రపక్షాల మద్దతు కోరేందుకు గురువారం ఆయన చెన్నైకు వచ్చారు. తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయానికి విచ్చేసిన సిన్హాను ముఖ్యమంత్రి స్టాలిన్‌ పుష్పగుచ్ఛంతో స్వాగతించారు. తర్వాత డీఎంకే కూటమి పార్టీల నేతలతో వీరు భేటీ అయ్యారు. సిన్హాకు డీఎంకే, కాంగ్రెస్‌, ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, టీవీకే, కేఎండీకే, ఎంఎంకే పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా యశ్వంత్‌ సిన్హా మాట్లాడుతూ.. మత సామరస్యాన్ని కాపాడేందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. సమాఖ్య వ్యవస్థ విజయానికి తన వంతు కృషి చేస్తానన్నారు. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కూల్చారని, శివసేన అసంతృప్త ఎమ్మెల్యే నేతృత్వంలోని ప్రభుత్వానికి భాజపా మద్దతు ప్రకటించిందని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదనే ఉద్దేశంతో భాజపాకు చెందినవారు ముఖ్యమంత్రి పదవిని ఆశించలేదని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే చర్యలను తమిళనాడు గవర్నర్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో డీఎంకే నేతలు కనిమొళి, ఉదయనిధి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని