తెలంగాణలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

‘కేంద్ర మంత్రివర్గం మొత్తం రాష్ట్రంపై పడింది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రులు వస్తున్నారు. రాజకీయ పార్టీలు వాటి నిర్మాణం కోసం రావడంలో తప్పులేదు. ఎలాగూ వస్తున్నారు కాబట్టి తెలంగాణలో

Published : 01 Jul 2022 05:44 IST

కేంద్ర మంత్రులకు వినోద్‌కుమార్‌ సవాల్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల, వీర్నపల్లి, న్యూస్‌టుడే: ‘కేంద్ర మంత్రివర్గం మొత్తం రాష్ట్రంపై పడింది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రులు వస్తున్నారు. రాజకీయ పార్టీలు వాటి నిర్మాణం కోసం రావడంలో తప్పులేదు. ఎలాగూ వస్తున్నారు కాబట్టి తెలంగాణలో అభివృద్ధిని చూసి మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పోల్చండి. దానిని ఇక్కడి భాజపా నాయకులకు చెప్పండి’ అంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రులను ఉద్దేశించి ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. ఇక్కడి అభివృద్ధిని చూసి తెలంగాణ అభివృద్ధి పథంలో పోతుందా? లేదా? పోల్చి చెప్పాలన్నారు. తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగింది, మీరు పాలించే రాష్ట్రాల్లో అభివృద్ధి ఎలా ఉందనేది నేరుగా చర్చ పెడదామా? అని సవాల్‌ విసిరారు. ఇక్కడున్న భాజపా నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నోరు పారేసుకుంటున్నారని వినోద్‌ విమర్శించారు. మీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే నోవాటెల్‌కు సమీపంలోని ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌ ప్రాంతాలను రాత్రి పూట తిరిగి చూడాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ మహానగరాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో అర్థమవుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని