రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇద్దరే

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ముఖాముఖి తలపడనున్నారు. వారిద్దరి నామినేషన్లు మాత్రమే ఆమోదం పొందాయి. నిబంధనల ప్రకారం లేని ఇతర నామినేషన్‌ పత్రాలన్నింటినీ

Published : 01 Jul 2022 05:44 IST

 ముర్ము, సిన్హా మధ్యే ముఖాముఖి పోరు

ఈనాడు, దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ముఖాముఖి తలపడనున్నారు. వారిద్దరి నామినేషన్లు మాత్రమే ఆమోదం పొందాయి. నిబంధనల ప్రకారం లేని ఇతర నామినేషన్‌ పత్రాలన్నింటినీ తిరస్కరించారు. నామినేషన్ల పరిశీలనకు చివరి రోజైన గురువారం.. రిటర్నింగ్‌ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. 94 మంది నుంచి 115 నామినేషన్లు రాగా వాటిలో 28 నామపత్రాలను ప్రాథమిక స్థాయిలోనే తిరస్కరించారు. మిగిలిన వాటిలో నిబంధనలకు తగ్గ సంఖ్యలో ప్రతిపాదకులు, సమర్థకులు లేరన్న కారణంతో కొన్నింటిని, రూ.15వేల డిపాజిట్‌ చెల్లించలేదని మరికొన్నింటిని పక్కనపెట్టారు. ముర్ము, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన 8 సెట్ల నామినేషన్లను మాత్రమే స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 9, తెలంగాణ నుంచి 3 నామినేషన్లు దాఖలైనా అవేవీ చెల్లలేదు. పోలింగ్‌ జులై 18న, ఓట్ల లెక్కింపు 21న జరుగుతుందన్నది తెలిసిందే.

బాదల్‌ మద్దతు కోరిన నడ్డా

భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా గురువారం శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ను కలిసి ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. పార్టీ సహచరులతో మాట్లాడి నిర్ణయాన్ని ప్రకటిస్తామని బాదల్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని