మహిళలకు రక్షణ కల్పించడంలో తెరాస సర్కారు విఫలం: షర్మిల

మహిళలకు రక్షణ కల్పించడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని కుసుమవారిగూడెం, కాసరబాద క్రాస్‌రోడ్డు, జమునానగర్‌, తాళ్లఖమ్మంపహాడ్‌, పెన్‌పహాడ్‌

Published : 01 Jul 2022 05:44 IST

పెన్‌పహాడ్‌, న్యూస్‌టుడే: మహిళలకు రక్షణ కల్పించడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని కుసుమవారిగూడెం, కాసరబాద క్రాస్‌రోడ్డు, జమునానగర్‌, తాళ్లఖమ్మంపహాడ్‌, పెన్‌పహాడ్‌ మండలం అనాజీపురం, అనంతారంలో ప్రజాప్రస్థాన పాదయాత్రను గురువారం కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ గాలికొదిలేశారని విమర్శించారు. బంగారు తెలంగాణ చేస్తామంటూ బాధల తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు. కౌలు రైతులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. వైతెపా అధికారంలోకి రాగానే రైతులు, కౌలురైతులకు చేయూతనందించి వ్యవసాయాన్ని పండుగ చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని