NTR: ఎన్‌టీఆర్‌ నిజమైన హీరో.. దేవుడు: త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌దేవ్‌

తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన ఎన్‌టీఆర్‌ అసలైన హీరో అనీ, ఆయన దేవుడని భాజపా సీనియర్‌ నేత, త్రిపుర మాజీ

Updated : 01 Jul 2022 10:31 IST

ఈటీవీ - ఆదిలాబాద్‌: తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన ఎన్‌టీఆర్‌ అసలైన హీరో అనీ, ఆయన దేవుడని భాజపా సీనియర్‌ నేత, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌దేవ్‌ వ్యాఖ్యానించారు. అంతక్రితం దాకా శాసనసభలో ప్రాతినిధ్యమే లేని స్థితి నుంచి ప్రజాబలంతో ఒక్కసారిగా ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారని అన్నారు. అలాగే త్రిపురలో కూడా కమ్యూనిస్టుల కంచు కోటను బద్దలుకొట్టి భాజపా రాజకీయ ప్రభంజనం సృష్టించిందని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ అధ్యక్షతన జరిగిన ఆదిలాబాద్‌ నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మీడియాతోనూ మాట్లాడారు. బోధ్‌లో ప్రకాశ్‌జావడేకర్‌, ఆసిఫాబాద్‌లో డయ్యూడామన్‌ అధ్యక్షుడు దీపేష్‌ తండల్‌, కాగజ్‌నగర్‌లో మణిపూర్‌ అధ్యక్షులు శారదాదేవీ, ముథోల్‌లో మాజీ మంత్రి రాజవర్థన్‌ సింగ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని