వరంగల్ జిల్లా భాజపా నేత తెరాసలోకి
కార్పొరేటర్ కూడా..
కండువా కప్పి స్వాగతించిన కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: వరంగల్ జిల్లా భాజపా మాజీ అధ్యక్షుడు, జోనల్ రైల్వే యూజర్ కమిటీ సభ్యుడు చింతాకుల సునీల్, అతని సోదరుడు వరంగల్ మహానగరపాలక సంస్థ కార్పొరేటర్ చింతాకుల అనిల్‌లు శుక్రవారం తెరాసలో చేరారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన నివాసంలో గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల నేతృత్వంలో రాష్ట్రంలో, వరంగల్ జిల్లాలో, మహానగర పాలక సంస్థ, తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తాము తెరాసలో చేరుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో భాజపాకు భవిష్యత్తు లేదన్నారు. హైదరాబాద్‌లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో గురువారం వరంగల్‌కు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ రవిశంకర్‌ప్రసాద్‌కు స్వాగతం పలికి, సత్కరించిన అనిల్, సునీల్‌లు తెల్లారేసరికి హైదరాబాద్‌లో తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు.
మంత్రి సబితకు అభినందనలు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులకు పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరం సర్కారు బడుల్లో నమోదు సంఖ్య రెట్టింపైందని, విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాలన్నివ్వడం, ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Heavy Rains: రెడ్ అలర్ట్.. నేటి నుంచి 3 రోజులు అతి భారీవర్షాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/08/2022)
-
World News
China-Taiwan ఉద్రిక్తతల వేళ.. తైవాన్ కీలక అధికారి అనుమానాస్పద మృతి
-
India News
Varun Gandhi: ఉచిత రేషన్ సరే.. ఆ రూ.10 లక్షల కోట్ల మాటేంటి..?
-
Movies News
Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
-
General News
Telangana News: గాంధీ సినిమా ఉచిత ప్రదర్శన.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- ఈ బాధలు భరించలేకపోతున్నానంటూ అమెరికాలో ప్రవాస భారతీయురాలి ఆత్మహత్య
- Tattoos: టాటూలు వేసుకున్న ఇద్దరికి హెచ్ఐవీ పాజిటివ్!
- Delhi: పోలీసుస్టేషన్లోకి చొరబడి మరీ.. కానిస్టేబుల్‌పై రౌడీ మూక దాడి
- Alibaba: 10 వేల మంది ఉద్యోగులకు అలీబాబా గుడ్‌బై.. 2016 తర్వాత తొలిసారి!
- BAN VS ZIM: బంగ్లా టైగర్స్‌ను బెంబేలెత్తిస్తోన్న జింబాబ్వే..! 9 ఏళ్ల తర్వాత తొలిసారి!
- CM Kcr: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పంద్రాగస్టు కానుక
- Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య