భాజపా, కాంగ్రెస్‌ బాహాబాహీ

అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ హనుమకొండలో శుక్రవారం కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు

Updated : 02 Jul 2022 06:55 IST

హనుమకొండ భాజపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మాజీ మేయర్‌ స్వర్ణ కారు అద్దాలు ధ్వంసం
సీఐ గన్‌మెన్‌కు గాయాలు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ హనుమకొండలో శుక్రవారం కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు హంటర్‌రోడ్డులోని భాజపా కార్యాలయం వద్ద నిరసన తెలియజేసేందుకు బయలుదేరారు. అప్పటికే అక్కడ భాజపా కార్యకర్తల సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్‌ నాయకులు ర్యాలీగా వచ్చి నినాదాలు చేస్తుండటంతో భాజపా జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ బయటకు వచ్చారు. ఎర్రబెల్లి స్వర్ణ, రావు పద్మల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు సముదాయించేందుకు ప్రయత్నిస్తుండగానే.. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య మాటామాట పెరిగి కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో స్వర్ణ కారు అద్దాలు ధ్వంసమవగా.. సుబేదారి సీఐ గన్‌మెన్‌ అనిల్‌ తలకు బలమైన గాయమైంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని