రైతులకు బేడీలు వేయడం అన్యాయం

పరిహారం కోరుతూ ఆందోళన చేస్తున్న గౌరవెల్లి నిర్వాసిత రైతులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్బంధించడాన్ని, వారికి బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర

Published : 02 Jul 2022 06:15 IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

ఈనాడు, హైదరాబాద్‌: పరిహారం కోరుతూ ఆందోళన చేస్తున్న గౌరవెల్లి నిర్వాసిత రైతులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్బంధించడాన్ని, వారికి బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది రైతులను తీవ్రంగా అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల కోసమే పుట్టాననీ, జీవితాంతం వారి కోసమే పనిచేస్తామని గొప్పలు చెప్పుకొని.. ఇప్పుడు రైతులను ఇలా అవమానించడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు బేెడీలు వేసిన పోలీసులపై చర్యలు చేపట్టాలనీ, రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పి, వారిపై కేసులను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని