తెలంగాణ సాధన పోరాటంలో భాజపా

తెలంగాణ భాజపా రెండు బుక్‌లెట్లు రూపొందించింది.  తెలంగాణ ప్రాంతంలో భాజపా చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చేసిన పోరాటాలను, ఇతర అంశాలను ఒక పుస్తకంలో వివరించారు. శనివారం నుంచి జరిగే జాతీయ కార్యవర్గ

Published : 02 Jul 2022 06:15 IST

బుక్‌లెట్లు రూపొందించిన రాష్ట్ర పార్టీ
జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చే నేతలకు పంపిణీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ భాజపా రెండు బుక్‌లెట్లు రూపొందించింది.  తెలంగాణ ప్రాంతంలో భాజపా చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చేసిన పోరాటాలను, ఇతర అంశాలను ఒక పుస్తకంలో వివరించారు. శనివారం నుంచి జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వాటిని నేతలకు పంపిణీ చేయనున్నట్లు పార్టీ నేత ఒకరు తెలిపారు. రాజ్‌నాథ్‌సింగ్‌ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా రాష్ట్ర పార్టీ చేసిన తీర్మానం తదితర అంశాలనూ కూడా ఇందులో చేర్చారు. అదేవిధంగా తెలంగాణలో మావోయిస్టుల సమస్య..వారి చేతిలో మరణించిన భాజపా కార్యకర్తల వివరాలతో మరో బుక్‌లెట్‌ను రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని