కీలుబొమ్మ రాష్ట్రపతి అవసరం లేదు

సమాజాన్ని మతప్రాతిపదికన చీలికలు పేలికలుగా చేస్తున్న ప్రస్తుత తరుణంలో దేశానికి ‘మౌన’ రాష్ట్రపతి అవసరం లేదని యశ్వంత్‌సిన్హా అన్నారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగిన ఈయన శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని

Published : 02 Jul 2022 06:15 IST

ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌సిన్హా

రాయ్‌పుర్‌: సమాజాన్ని మతప్రాతిపదికన చీలికలు పేలికలుగా చేస్తున్న ప్రస్తుత తరుణంలో దేశానికి ‘మౌన’ రాష్ట్రపతి అవసరం లేదని యశ్వంత్‌సిన్హా అన్నారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగిన ఈయన శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ అధికారమే పరమావధిగా చేస్తున్న ఇటువంటి విన్యాసాలు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. దేశాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతున్న సిద్ధాంతాలతో పోరాటమే రాష్ట్రపతి ఎన్నికగా పేర్కొన్నారు. ‘రాష్ట్రపతి పదవి ఎంతో గౌరవప్రదమైనది. రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. చరిత్రలో మనం చాలామంది రాష్ట్రపతులను చూశాం. కొందరు ఆ పదవికి గౌరవం తెస్తే, మరికొందరు మౌనంగా ప్రేక్షకపాత్ర పోషించారు. నేడు దేశమంతటా అశాంతి ప్రబలి ఉంది. కొందరి సిద్ధాంతాలే దీనికి కారణం. ప్రధాని చేతిలో కీలుబొమ్మగా ఉండే రాష్ట్రపతి ఇటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేరు’ అని యశ్వంత్‌సిన్హా వ్యాఖ్యానించారు. అధికార దాహం ప్రమాదకరమని, మహారాష్ట్ర పరిణామాల వంటి రాజకీయాలతో మన ప్రజాస్వామ్య విలువలు పెరుగుతాయా? అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని