క్షేత్రస్థాయిలో మౌలిక వసతులతో ప్రగతి

క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి ద్వారానే ప్రజల ప్రగతి సాధ్యమన్నది తన అభిప్రాయమని ఎన్డీఏ పక్ష రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌ బద్దీలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలను ఉద్దేశించి

Published : 02 Jul 2022 06:15 IST

ద్రౌపదీ ముర్ము

శిమ్లా: క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి ద్వారానే ప్రజల ప్రగతి సాధ్యమన్నది తన అభిప్రాయమని ఎన్డీఏ పక్ష రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌ బద్దీలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.


శిరోమణి అకాలీదళ్‌ మద్దతు

చండీగఢ్‌: భాజపాకు మాజీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకే తాము మద్దతు ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌సింగ్‌ బాదల్‌ను కలిసి మద్దతు కోరిన మరుసటిరోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. స్థానిక అతిథిగృహంలో బస చేసిన ద్రౌపదీ ముర్మును అకాలీదళ్‌ నేతలు కలిశారు. చండీగఢ్‌లోని హరియాణా భవన్‌లో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, శాసనసభ్యులతోనూ ముర్ము భేటీ అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని