ద్రౌపదీ ముర్ముకు అన్నాడీఎంకే, పీఎంకే మద్దతు

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము శనివారం చెన్నై వచ్చారు. నుంగంబాక్కంలో ఉన్న ప్రైవేటు హోటల్‌లో మొదట భాజపా, పీఎంకే నేతలు, తర్వాత వేర్వేరుగా అన్నాడీఎంకే

Published : 03 Jul 2022 05:35 IST

చెన్నై(ప్యారిస్‌), న్యూస్‌టుడే: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము శనివారం చెన్నై వచ్చారు. నుంగంబాక్కంలో ఉన్న ప్రైవేటు హోటల్‌లో మొదట భాజపా, పీఎంకే నేతలు, తర్వాత వేర్వేరుగా అన్నాడీఎంకే నాయకులు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం ద్రౌపదీ ముర్మును కలిసి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్‌ పాల్గొన్నారు. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకుముందు పుదుచ్చేరిలో ఎన్డీయే-ఎన్నార్‌ కాంగ్రెస్‌ కూటమి పార్టీల నేతలతో ద్రౌపదీ ముర్ము సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రంగస్వామి, సభాపతి సెల్వం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని