విభజన చట్టం హామీలను అమలుచేయాలి

రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది.

Published : 03 Jul 2022 05:35 IST

తెదేపా డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. వీటి అమలు కోసం తెరాస ప్రభుత్వం కేంద్ర సర్కారుపై పోరాడిన దాఖలాలు లేవని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. వీటిని అమలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలపైనే ఉందని ఆయన పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి ఎనిమిది ఏళ్లయినా ఉమ్మడి ఆస్తుల విభజన అంశం ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదని ఆయన గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని