ఇలాగైతే ప్రజల్లోకి ఎలా వెళ్లాలి?

‘పార్టీ కోసం తొలి నుంచి కష్టపడుతుంటే కొందరు స్వలాభాలు చూసుకుంటున్నారు. వార్డు సమస్యలపై అడిగినా పట్టించుకోకపోవడంతో ప్రజల వద్దకు ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి

Published : 03 Jul 2022 05:35 IST

వెంకటగిరిలో వైకాపా కౌన్సిలర్ల అసమ్మతి గళం

వెంకటగిరి, న్యూస్‌టుడే: ‘పార్టీ కోసం తొలి నుంచి కష్టపడుతుంటే కొందరు స్వలాభాలు చూసుకుంటున్నారు. వార్డు సమస్యలపై అడిగినా పట్టించుకోకపోవడంతో ప్రజల వద్దకు ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది...’ అని తిరుపతి జిల్లా వెంకటగిరి పురపాలికలోని కొందరు వైకాపా కౌన్సిలర్లు తీవ్రంగా ధ్వజమెత్తారు. శనివారం వివిధ అంశాలపై వారు తమ అసమ్మతి గళం విప్పారు. పట్టణంలో అభివృద్ధి పనులు కొన్ని వార్డులకే పరిమితమవుతున్నాయని, పార్టీ కోసం పని చేసే వారికి సరైన న్యాయం జరగడం లేదని, పార్టీకి ఓటు వేయనివారు పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్‌ సమావేశంలోనే మహిళా కౌన్సిలర్లపై కొందరు దురుసుగా ప్రవర్తిస్తుంటే వాటినీ అడ్డుకోవడం లేదని చెప్పారు. పట్టణంలో చేసిన కొద్దిపాటి అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడిందని ఆరోపించారు. గుత్తేదారులు ఏడాదిగా పనుల్ని చేయకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారని, వార్డుల్లోకి వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని చెప్పారు. కనీసం వీధి దీపం వెలిగించలేని స్థితిలో ఉన్నామని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని