తాగునీరు లేకున్నా పుష్కలంగా బార్లు

రాష్ట్రంలో తాగునీరు లేకున్నా బీర్లు, బార్లు పుష్కలంగా ఉన్నాయని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. తెలంగాణలోని ప్రతి వాడలో బడి, గుడి లేకున్నా..

Published : 03 Jul 2022 05:35 IST

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

గరిడేపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తాగునీరు లేకున్నా బీర్లు, బార్లు పుష్కలంగా ఉన్నాయని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. తెలంగాణలోని ప్రతి వాడలో బడి, గుడి లేకున్నా.. మద్యం దుకాణాలు మాత్రం ఉన్నాయని విమర్శించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడులో శనివారం నిర్వహించిన పాదయాత్రలో ఆమె మాట్లాడారు. మగ పిల్లలను కన్న తల్లిదండ్రులు తమ పిల్లలు మద్యానికి బానిసై ఆగమైపోతారేమోనని భయపడుతున్నారన్నారు. మహిళలకు రక్షణ లేకపోవడంతో ఆడ పిల్లలున్న తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని చెప్పారు. ప్రభుత్వం దళితులను పురుగుల్లా చూస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం కేసీఆర్‌ నెరవేర్చలేదన్నారు. గ్రామాల్లో సమస్యలు లేవని కేసీఆర్‌ నిరూపిస్తే నేలకు ముక్కురాసి పాదయాత్రను నిలిపివేస్తానని, లేదంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని షర్మిల సవాల్‌ విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని