cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
నోరూరించే సేమియా పాయసం.. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే బెల్లం పరమాన్నం.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెసరపప్పు గారెలు.. సకినాలు.. ఇలా 50 రకాల తెలంగాణ సంప్రదాయ వంటకాలతో అతిథుల కడుపు నిండింది.
భాజపా నేతలకు చవులూరించిన 50 రకాల తెలంగాణ వంటకాలు
నోరూరించే సేమియా పాయసం.. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే బెల్లం పరమాన్నం.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెసరపప్పు గారెలు.. సకినాలు.. ఇలా 50 రకాల తెలంగాణ సంప్రదాయ వంటకాలతో అతిథుల కడుపు నిండింది. షడ్రుచుల సమ్మేళనంతో భోజనాలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ సమీపంలోని గౌరవెల్లి గుడాటిపల్లికి చెందిన యాదమ్మ బృందం తయారు చేసిన వంటకాలు ఆదివారం రెండోరోజైన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చవులూరించాయి. పూర్తిగా శాకాహార భోజనం వడ్డించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, నాయకులు, జాతీయ మీడియా ప్రతినిధులు ఆయా వంటకాల పేర్లు ప్రత్యేకంగా అడిగి తెలుసుకుని తిన్నారు. రుచి అద్భుతంగా ఉందని అభినందించారు. చిక్కుడుకాయ టమాటా కూర, ఆలూ కుర్మా, వంకాయ మసాలా, దొండకాయ పచ్చికొబ్బరి తురుము ఫ్రై, బెండకాయ-జీడిపప్పు-పల్లీల ఫ్రై, తోటకూర టమాటా ఫ్రై, బీరకాయ మీల్మేకర్, మెంతికూర పెసరపప్పు, గంగవాయిలకూర - మామిడికాయ పప్పు, సాంబారు, ముద్దపప్పు, పచ్చిపులుసు, బగారా రైస్, పులిహోర, పుదీనా రైస్, అన్నం, పెరుగన్నం, గోంగూర (పుంటికూర) పచ్చడి, దోసకాయ ఆవ పచ్చడి, టమాటా, సొరకాయ పచ్చళ్లు తదితరాలను వడ్డించారు. ఇంకా భక్షాలు, బూరెలు, మక్కగుడాలు, సర్వపిండి, టమాటా పచ్చడి, పల్లీపచ్చడి, పచ్చికొబ్బరి పచ్చడి, మిర్చి బజ్జీలు చేశారు. వందల మంది భాజపా నాయకులు వంటకాలను రుచిచూశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్‌లకు సూర్య దూరమేనా? ఇన్‌స్టా పోస్ట్ వైరల్
-
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’
-
Hyderabad: ప్రణీత్‌రావుకు సహకరించింది ఎవరు?
-
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్