Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బయల్దేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆదివారం రాత్రి అర్ధంతరంగా

Updated : 04 Jul 2022 07:30 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బయల్దేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆదివారం రాత్రి అర్ధంతరంగా వెనుదిరిగారు. ఏపీ పోలీసులు అనుసరిస్తుండటంతోనే ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది.

లింగంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో రఘురామ అనుచరులతో కలిసి భీమవరం బయలుదేరారు. ఏపీ పోలీసులు అనుసరిస్తున్నారని ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట స్టేషన్‌లో రైలు దిగిపోయారు. తన అనుచరులు కొందరిపై ఇప్పటికే పలు కేసులుండటంతో వారిని మరింత ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక పర్యటన రద్దు చేసుకుని ఆయన తిరిగి వెళ్లిపోయారని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని