Updated : 05 Jul 2022 06:49 IST

ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆత్మహత్యలే: మంత్రాలయం తెదేపా ఇన్‌ఛార్జ్‌ తిక్కారెడ్డి

ఈనాడు, కర్నూలు: ‘వైకాపా నాయకులకు జగన్‌ దేవుడు. ధర్నా చేయాలన్నా... సర్పంచి.. ఎమ్మెల్యేల ఎన్నికలకు వెళ్లాలన్నా మూటలు మూటలుగా ఇస్తారు. ఈ రోజు తెలుగుదేశం నాయకులందరూ రాష్ట్రంలో ఆస్తులు అమ్ముకున్నారు. మరోసారి ఎన్నికలకు దిగితే అంతా దివాళా తీయడమే. రైతుల్లా... నాయకులూ ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే...’ అని కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ తెదేపా బాధ్యుడు తిక్కారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ మంత్రాలయం నుంచి చిలకలడోన వరకు ఆయన పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. అనంతరం చిలకలడోనలోని ఓ దుకాణంలో టీ తయారు చేస్తూ మాట్లాడారు. ‘నాపై గెలిచిన బాలనాగిరెడ్డి దేవుడి చిత్రాలు తీసేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రతి రోజూ గోనె సంచుల నిండా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆన్‌లైన్‌ పేమెంట్‌ లేకుండా రూ.500, రూ.2 వేలు నోటిస్తేనే ఇసుక ఎత్తుతున్నారు. గుడికంబాల రీచ్‌వద్ద ప్రతి రోజు 400 లారీల ఇసుక ఎత్తి 50 బిల్లులు కొడుతున్నారు. మరో పక్క మా పరిస్థితి ఏమిటంటే ఎన్నికలకు పొలాలు, ఆస్తులు అమ్ముకుంటున్నాం. ఇంకో ఎన్నిక జరిగితే నాకు ఉన్న ఆస్తి మొత్తం పోతుంది. ఇక టీ అమ్ముకొని బతకాల్సిందే...’ అని తిక్కారెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో ఈసారి కచ్చితంగా గెలుస్తామంటూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ భరోసా ఇచ్చారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని