Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా మద్దతు కోరాం: కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైకాపాను కోరినట్లు రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ కమిటీకి నేతృత్వం వహిస్తున్న కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పారు. ఈ విషయాన్ని సోమవారం ఏఎన్‌ఐ వార్తా సంస్థ ట్విటర్‌లో పోస్టు చేసింది.

Updated : 12 Jul 2022 08:04 IST

ఈనాడు, దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైకాపాను కోరినట్లు రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ కమిటీకి నేతృత్వం వహిస్తున్న కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పారు. ఈ విషయాన్ని సోమవారం ఏఎన్‌ఐ వార్తా సంస్థ ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమెకు మద్దతు ఇవ్వాలని ఎన్డీయే పక్షాలన్నింటికీ భాజపా విజ్ఞప్తి చేసింది. మేం వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికీ విజ్ఞప్తి చేశాం. ఆమె నామినేషన్‌ కార్యక్రమంలో ఇతర నేతలతోపాటు వైకాపా ఉభయ సభాపక్ష నేతలు పాల్గొన్నారు’ అని గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పినట్లు ఏఎన్‌ఐ సంస్థ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని