వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తోంది

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల రికార్డు కోసం అడుగులు వేసేట్లుందని భాజపా ఫీడ్‌ బ్యాక్‌ ప్రముఖ్‌ లంకా దినకర్‌ ఓ

Published : 23 Jul 2022 06:37 IST

భాజపా నాయకుడు లంకా దినకర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల రికార్డు కోసం అడుగులు వేసేట్లుందని భాజపా ఫీడ్‌ బ్యాక్‌ ప్రముఖ్‌ లంకా దినకర్‌ ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ‘‘కేంద్రం, ఆర్బీఐ హెచ్చరికలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పరిమితికి మించి రాష్ట్రం చేసిన అర్హమైన రుణాలను రాబోయే నాలుగేళ్లలో కేంద్రం సర్దుబాటు చేయనుండటం నిజమో, కాదో వీరు చెప్పాలి. కార్పొరేషన్లకు రుణాల అంశంలో ఆర్టికల్‌ 293(3) నిబంధనల ఉల్లంఘనపై రాష్ట్రానికి కేంద్రం రాసిన లేఖ సారాంశాన్ని బహిర్గతపరచాలి. రుణ పరిమితి విషయంలో స్వయంగా చేసుకున్న చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తుంగలో తొక్కింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వేసిన తప్పుడు గణాంకాలను సవరించి వాస్తవాలు ప్రకటిస్తే అప్పుల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది. కేంద్రం పేదలకు ఉచితంగా ఇస్తున్న రూ.అయిదు కిలోల బియ్యాన్ని ప్రజలకు పంచడంలోనూ రాష్ట్రం విఫలమైంది’’ అని లంకా దినకర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు