ఆ ఇద్దరినీ ప్రశ్నిస్తే జైలుకే

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలపై ధ్వజమెత్తారు.

Published : 06 Aug 2022 02:46 IST

మోదీ, అమిత్‌షాలపై రాహుల్‌ గాంధీ ధ్వజం

దిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలపై ధ్వజమెత్తారు. ‘ప్రజాస్వామ్య హననాన్ని మనం చూస్తున్నాం. నియంతృత్వానికి ఎదురు నిలిచిన వారిని జైల్లో పెడుతున్నారు’ అని మండిపడ్డారు. గాంధీ కుటుంబం ఒక సిద్ధాంతం కోసం పోరాడుతుందని తెలిపారు. ‘ప్రజాస్వామ్యం కోసం, సమాజంలో సామరస్యం కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నాం. మా కుటుంబం ప్రాణత్యాగాలు చేసింది. రెండు వర్గాల మధ్య గొడవలు పెడుతుంటే, దళితుల్ని చంపేస్తుంటే చాలా బాధ కలుగుతోంది. అందుకే మేము పోరాడతాం. ఇది ఒక కుటుంబం కాదు.. ఒక సిద్ధాంతం’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

భాజపా ఎదురుదాడి

‘గాంధీ అంటే ఓ కుటుంబం కాదు, సిద్ధాంతం’ అన్న రాహుల్‌ వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా స్పందించింది. ‘ఆయన(రాహుల్‌) మహాత్మా గాంధీ వారసుడేమీ కాదు. ఆయన ‘నకిలీ’ గాంధీ. వారిది నకిలీ సిద్ధాంతం’ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని భాజపా నేత రవి శంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని