Updated : 06 Aug 2022 03:48 IST

Congress: భాజపా నుంచి దేశాన్ని రక్షించేందుకు మరో ఉద్యమం

ధర్నాలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క

గాంధీభవన్‌, ముషీరాబాద్‌, న్యూస్‌టుడే: బహుళ జాతి సంస్థల కొమ్ము కాస్తూ దేశ వినాశనానికి పాల్పడుతున్న భాజపా పాలకుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తితో మరోసారి ఉద్యమించాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్‌ అనేక సంస్థలు, వ్యవస్థల    ఏర్పాటుతో నవ భారత నిర్మాణం చేసిందన్నారు. ధరలు, జీఎస్టీ పెంపును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టింది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భాజపా విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఈడీ, సీబీఐ, ఐటీలను ఉసిగొల్పి అక్రమ కేసులతో జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సీతక్క, మల్లు రవి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, చిన్నారెడ్డి, బెల్లయ్య నాయక్‌, అనిల్‌కుమార్‌, మెట్టు సాయికుమార్‌, సునీతారావు, తదితరులు మాట్లాడారు. తనకంటే జూనియర్లను మాట్లాడించి తనకు అవకాశం కల్పించకపోవడంపై పీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

చలో రాజ్‌భవన్‌కు ప్రయత్నం..ఉద్రిక్తత..అరెస్టు

ధర్నా అనంతరం కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు రాజ్‌భవన్‌కు బయలుదేరడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అంజన్‌కుమార్‌యాదవ్‌, మహేష్‌కుమార్‌ గౌడ్‌, అనిల్‌కుమార్‌, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని