Published : 06 Aug 2022 04:28 IST

మాధవ్‌ కేసును స్పీకర్‌ సుమోటోగా స్వీకరించాలి: మండలి బుద్ధప్రసాద్‌

అవనిగడ్డ, న్యూస్‌టుడే: ఎంపీ గోరంట్ల మాధవ్‌ అశ్లీల వీడియో వ్యవహారాన్ని లోక్‌సభ స్పీకర్‌ సుమోటోగా స్వీకరించి, విచారణలో రుజువైతే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ కోరారు. శుక్రవారం ఆయన అవనిగడ్డలో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్లో అసభ్య పదాలు ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పిన స్పీకర్‌.. మాధవ్‌ ప్రవర్తనతో పార్లమెంటు ప్రతిష్ఠ మసకబారేలా చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.

‘ఇలాంటివాళ్లను జగన్‌ ఊరి మీదకు వదిలారు’

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంపై తెదేపా నేతలు ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇలాంటి వారిని ఊరి మీదకు వదిలి దిక్కులేని దిశ చట్టం తెచ్చారని తెదేపా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి మంత్రి పదవులు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు.

తలదించుకోవాల్సిన పరిస్థితి: సోమిరెడ్డి
‘వైకాపా నేతల ప్రవర్తన, భాష చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిన నెలకొన్నాయని తెదేపా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘కియా కంపెనీ ప్రతినిధులతో నీచంగా ప్రవర్తించినప్పుడే ఇంటికి పంపించాల్సింది. కానీ సరసాలు, అత్యాచార కేసుల్లో నిందితులకు అవార్డులు, రివార్డులు ఇవ్వడం సీఎం జగన్‌కు అలవాటుగా మారింది’ అని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts