భాజపాది పూటకో మాట: సీపీఎం

భాజపా, వైకాపాల తప్పులను ప్రజలు ఊరూ, వాడా లెక్కిస్తున్నారని.. భవిష్యత్తులో వీరిద్దరి లెక్కలు తేలుస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్‌ బాబూరావు

Published : 06 Aug 2022 04:28 IST

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: భాజపా, వైకాపాల తప్పులను ప్రజలు ఊరూ, వాడా లెక్కిస్తున్నారని.. భవిష్యత్తులో వీరిద్దరి లెక్కలు తేలుస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్‌ బాబూరావు అన్నారు. అమరావతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం రాజధాని గ్రామం మందడంలో సీపీఎం నాయకులు కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న బాబూరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అమరావతికి నిధులు కోరుకుంటున్నారు గాని... అమిత్‌షాతో అపాయింట్‌మెంట్‌ కాదని భాజపా నాయకులు గ్రహించాలన్నారు. భాజపా నేతలు పూటకో మాట, రోజుకో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు, మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత మొత్తం కేంద్రానిదేనని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం.రవి, భాగ్యరాజు, శివాజీ, లక్ష్మణరావు, ఆంజనేయులు, ఎర్రమనేని శ్రీనివాసరావు, చెంచయ్య, జానీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని