Published : 06 Aug 2022 04:28 IST

ప్రభుత్వ పథకాలు అందడం లేదంటే కేసా?

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ప్రశ్న

ఈనాడు, అమరావతి: ‘‘గడప గడపకు కార్యక్రమంలో తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని శాసనసభ్యులకు ఫిర్యాదు చేసిన వారిపై పోలీసు కేసు నమోదు చేయడం భావ్యం కాదు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం వేపనపల్లిలో ఐనా జశ్వంత్‌ ప్రశ్నించినందుకు కేసు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారు. అక్కడి ఎమ్మెల్యే జనసేన కుటుంబానికి చెందిన వారి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీస్తే తమకు అందడం లేదని జశ్వంత్‌ తెలిపారు. దీంతో 16 ఏళ్ల ఆ యువకుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం’’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. జశ్వంత్‌ కుటుంబానికి మద్దతుగా వెళ్లిన జనసేన పార్టీ నాయకులపై కూడా ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని బట్టి వైకాపా ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో అర్థమవుతోందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనసేన పార్టీ వారికి పథకాలు అందబోవంటూ ఎమ్మెల్యేయే నేరుగా చెప్పడం వారి దాష్టీకాలకు అద్దం పడుతోందన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో జనసేన నాయకులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని