చమురు సంస్థలపై పోరాడి గెలవడం అభినందనీయం

చమురు, సహజ వాయు సంస్థలైన ఓఎన్‌జీసీ, గెయిల్‌లపై గత రెండేళ్లుగా న్యాయపోరాటం చేసి గెలిచిన రాజోలు నియోజకవర్గం జనసైనికుడు వెంకటపతిరాజా పోరాటం అభినందనీయమని

Published : 06 Aug 2022 05:21 IST

జనసేన నేత కొణిదెల నాగబాబు

ఈనాడు, అమరావతి: చమురు, సహజ వాయు సంస్థలైన ఓఎన్‌జీసీ, గెయిల్‌లపై గత రెండేళ్లుగా న్యాయపోరాటం చేసి గెలిచిన రాజోలు నియోజకవర్గం జనసైనికుడు వెంకటపతిరాజా పోరాటం అభినందనీయమని ఆ పార్టీ నాయకులు కొణిదెల నాగబాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోనసీమ జిల్లాలో జల, భూ కాలుష్యానికి ఓఎన్‌జీసీ కారణమని భావించి చెన్నైలోని హరిత ట్రైబ్యునల్‌ రూ.22.72 కోట్ల జరిమానా విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ విషయంలో వెంకటపతిరాజా అన్ని ఆధారాలతో 2020లో హరిత ట్రైబ్యునల్‌లో ఫిర్యాదు చేశారని నాగబాబు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు