చౌటుప్పల్‌లోనే అమిత్‌షా సభ..

నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో ఈ నెల 21న అమిత్‌షా పాల్గొనే భారీ బహిరంగ సభలో తాను, తనతో పాటు అనేకమంది ఇతర పార్టీల నేతలు భాజపాలో చేరనున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. దిల్లీ

Published : 07 Aug 2022 05:13 IST

అక్కడే భాజపాలో చేరతా: రాజగోపాల్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ:  నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో ఈ నెల 21న అమిత్‌షా పాల్గొనే భారీ బహిరంగ సభలో తాను, తనతో పాటు అనేకమంది ఇతర పార్టీల నేతలు భాజపాలో చేరనున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. దిల్లీ తెలంగాణభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నిక సునామీలో తెరాస, కాంగ్రెస్‌లు కొట్టుకుపోతాయన్నారు. ఉపఎన్నిక కాకుండా ముందస్తుకు పోతే తెరాస పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందన్నారు. ఉపఎన్నిక భయంతోనే నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, ఇతర పనుల కోసం అధికారులు కొలతలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.  

తెలంగాణలో ఉన్నది పసుపు కాంగ్రెస్‌ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ వెనక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డిని సీఎం అంటున్నారని, సీఎం అంటే ‘చంద్రబాబు ముద్దుబిడ్డ’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు చంద్రబాబు డైరెక్షన్‌లో తిరిగి తెలంగాణను వశం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌గా తామెప్పుడూ కలిసే ఉంటామన్నారు. భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలను శనివారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సాయంత్రం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌నూ కలిసి చేరిక కార్యక్రమంపై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని